(Local) Mon, 17 Jun, 2019

మోస్ట్‌ డేంజరస్‌ ల్యాప్‌టాప్‌ వేలం

May 29, 2019,   12:18 PM IST
Share on:

ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ ల్యాప్‌టాప్‌గా పేరొందిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ వేలానికి వచ్చింది. అయితే దీని వేలం నిర్వహించగా..1.3 మిలియన్‌ డాలర్లు పలకడం విశేషం. కాగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, కంపెనీలకు ఆర్థికంగా 95 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరువచ్చింది. ది పర్సిస్టెన్స్‌ ఆఫ్‌ ఖోస్‌ గా పేర్కొనే ఈ డివైజ్‌లో.. ప్రపంచాన్ని గడగడలాడించిన వాన్నాక్రై, ఐలవ్‌యూ, డార్క్‌ ఎనర్జీ, సోబిగ్‌, మైడూమ్‌, డార్క్‌టెక్విలా వైరస్‌లు,రాన్సమ్‌వేర్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను గ్యూ ఓ డాంగ్‌ అనే ఇంటర్నెట్‌ ఆర్టిస్ట్‌ రూపొందించాడు. వైరస్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. ఇలాంటివి భౌతికంగా మనపై దాడి చేస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.