(Local) Wed, 21 Aug, 2019

ఇండియా మార్కెట్లో విడుదల అవుతున్న నోకియా 2.2

June 07, 2019,   2:08 PM IST
Share on:

నోకియా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. నోకియా 2.2 ఇండియా మార్కెట్లో విడుదలైంది. టంగస్టన్ బ్లాక్ అండ్ స్టీల్ కలర్లలో ఈ ఫోన్ యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చౌకైన ధరకే నోకియా అందిస్తున్న ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. 5.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేతో పాటు రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. నోకియా 2.2 మోడల్ స్మార్ట్ ఫోన్ లో 13MP రియర్ కెమెరా, హెలియో A22 SoC ప్రాసిసర్ ఎట్రాక్టీవ్ గా ఉన్నాయి. నోకియా 2.2 స్మార్ట్ ఫోన్ పై తక్కువ ధరతో జూన్ 30 వరకు కంపెనీ ఆఫర్ అందిస్తోంది.ఈ ఫోన్ అన్ని మొబైల్ రిటైల్ స్టోర్లు, నోకియా, ఈ కామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్ కార్ట్ లో జూన్ 11 నుంచి అందుబాటులో ఉండనుంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. జియో యూజర్లు నోకియా 2.2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. వారికి రూ.2వేల 200తో పాటు 100GB అదనంగా డేటాను అందిస్తోంది.

తొలి వేరియంట్ (2GB +16GB) స్టోరేజీ కేవలం రూ.6,999కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. మరో వేరియంట్ (3GB +32GB) స్టోరేజీతో ధర రూ.7,999కే అందిస్తోంది. ఈ ఆఫర్ తర్వాత నోకియా 2.2 రెండు వేరియంట్లు రూ.7,699, రూ.8,699 ధరకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇండియా మార్కెట్లో నోకియా అందించే నోకియా 2.2లో మోస్ట్ సెక్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ ఆండ్రాయిడ్ వన్ తో తీసుకోస్తోంది.

* 5.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే
* ఫేస్ రికగ్నైజేషన్ 5MP కెమెరా, టీయర్ డ్రాప్ నాచ్
* మీడియా టెక్ హెలియా A22 చిప్ సెట్
* సింగల్ ఫ్లాష్ 13MP సెన్సార్ 
* AutoHDR, లో లైట్ ఇమేజ్ ఫ్యూజన్ 
* ఆండ్రాయిడ్ 9 పై OS, ఆండ్రాయిడ్ Q అప్ డేట్

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.