(Local) Wed, 24 Jul, 2019

భద్రత-గోప్యత లక్ష్యంగా గూగుల్‌ లో సరికొత్త ఫీచర్లు

June 01, 2019,   11:46 AM IST
Share on:

వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత, గోప్యత ఉండేలా సరికొత్త ఫీచర్లు అమల్లోకి తీసుకు వస్తున్నట్లు గూగుల్‌ సెర్చింజిన్‌ పేర్కొంది.
గూగుల్‌ చీఫ్‌ ప్రైవసీ అధికారి కీత్‌ ఎన్‌రైట్‌ విలేకరులతో మాట్లాడుతూ... గూగుల్‌ ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకుంటున్న వారందరికీ ఒకే రకమైన భద్రత కల్పించడం తమ లక్ష్యమని వివరించారు.వినియోగదారుల సమాచారాన్ని థర్డ్‌ పార్టీ డెవలపర్స్‌ ఇతరులతో పంచుకుంటున్నారని గుర్తించామని,దీన్ని నియంత్రించేందుకు గోప్యత విధానాన్ని పాటించాలని సూచించినట్లు తెలిపారు.క్రోమ్‌ ఎక్సటెన్షన్‌ డెవలపర్స్‌ కూడా వినియోగదారుల భద్రతను కాపాడేలా అదనపు మార్పులు చేసినట్లు వివరించారు.గూగుల్‌ సెర్చింగ్‌ కంట్రోల్స్‌ను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తామన్నారు.గూగుల్‌ ఉత్పత్తుల, సేవలన్నింటికీ ఒకే టాప్‌ ఉపయోగించనున్నట్లు కీత్‌ ఎన్‌రైట్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.