(Local) Wed, 24 Jul, 2019

వాట్సాప్ లో కొత్త సదుపాయం

June 18, 2019,   11:59 AM IST
Share on:

వాట్సాప్  వినియోగదారులకు శుభవార్త. వాట్సాప్ లో తాజాగా మరో కొత్త సదుపాయం వచ్చింది.సహజంగా మనం వాట్సాప్ చాటింగ్ ద్వారా ఎవరైనా స్నేహితులకు మన ఫోన్ లో ఉన్న ఫోటోలను పంపించేటప్పుడు కొన్ని సందర్భాలలో ఒకరికి పంపించాల్సిన ఫోటోలను మరొకరికి పంపిస్తూ ఉంటాం. ఆ తర్వాత పొరపాటున పంపించామని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది.ఈ సమస్యను అధిగమించడం కోసం, వాట్సాప్ సంస్థ తాజాగా కొత్త సదుపాయం ప్రవేశపెట్టింది.  ఇకమీదట మీరు ఏదైనా వాట్సాప్ కన్వర్‌జేషన్‌లో ఉన్నప్పుడు అటాచ్మెంట్ బటన్ ప్రెస్ చేసి,  ఫోటోలను ఎటాచ్ చేసేటప్పుడు, ఆ ఫోటోలు కింద క్యాప్షన్ అనే ప్రదేశంలో, ప్రస్తుతం మీరు ఎవరికి ఆ ఫోటోలు పంపిస్తుంది వారి పేరు పేర్కొనబడుతుంది. దీంతో ఒకరికి పంపించాల్సిన ఫోటోలు మరొకరికి పంపించకుండా జాగ్రత్త పడవచ్చు

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.