(Local) Tue, 02 Jun, 2020

దేశీయ మార్కెట్లోకి మొర్రిస్ గ్యారేజెస్ సరికొత్త కారు

June 28, 2019,   2:42 PM IST
Share on:
దేశీయ మార్కెట్లోకి మొర్రిస్ గ్యారేజెస్ సరికొత్త కా ...

బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం MG (మొర్రిస్ గ్యారేజెస్) మోటార్స్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త కారు హెక్టర్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.12.18లక్షలుగా నిర్ణయించింది. ఈ మోడల్ చాలా ధర ఉంటుందని అందరూ అంచనా వేశారు. అయితే తక్కువ రేటులో ధరలు ఉండడం అందరినీ ఆశ్చర్యపర్చింది. టాప్ వేరియంట్ ధర రూ.16.88 లక్షలుగా ఉంది. హెక్టర్ కారు స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ఫ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కంపెనీ భారత్‌లో మొత్తం 120 కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటి సంఖ్య 250కు పెంచనుంది.

ఈ కారు టెక్నాలజీ అందరినీ అబ్బురపర్చేలా ఉంటుందని అంతా ఊహించినట్టుగానే ఉంది. ఈ కారు ధర, మైలేజీ, ఫీచర్ల గురించి వదిలేస్తే టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఈ టెక్ కారు కోసం మైక్రోసాఫ్ట్, అడోబ్, ఎస్‌ఎపి, సిస్కో, గానా, టామ్‌టామ్, అన్‌లిమిటెడ్ వంటి టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పోర్ట్ యుటిలిటీ వాహనం హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ కిక్స్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యువి 500, హ్యుందాయ్ టక్సన్‌లకు గట్టి పోటీనివ్వనుందని అంచనా వేస్తున్నారు.

ఈ కారు ప్రత్యేకతలు
1. హెక్టార్ కారుని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇమెయిల్, ఇతర ఫైల్స్ చూసుకోవచ్చు. అలాగే ఎక్కడ పార్కింగ్ చేసింది తెలుసుకునేందుకు ‘లొకేట్ మై కార్’ ఆప్షన్ సౌలభ్యం ఉంది. ఈ కారును దొంగిలించినా గుర్తించడం చాలా సులభం. 360 డిగ్రీల కోణంలో చూపించే కెమెరా, డ్రైవర్ అనలిటికల్ డేటా, ఐస్మార్ట్ యాప్‌తో టైర్ ప్రెషర్, డోర్లు లాక్, అన్‌లాక్, ఎయిర్ కండీషనర్ చేసుకునే సౌకర్యాలు వంటివి ఉన్నాయి.

2. ఈ కారులో 10.4 అల్ట్రా లార్జ్, ఫుల్ హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ ఉంటుంది. హై-ఎండ్ కార్లలో కూడా ఇంత పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేదు. దీనిని స్మార్ట్‌ఫోన్‌లా చేతితో కమాండ్ ఇవ్వొచ్చు, అలాగే వాయిస్ ఆదేశాల ద్వారా కూడా పని చేస్తుంది. ‘హలో ఎంజి’ అనగానే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఓపెన్ సన్‌రూఫ్, క్లోజ్ విండో, ఆన్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్, ఆఫ్ నావిగేషన్ అనేక కమాండ్స్‌కి అనుగుణంగా పనిచేస్తుంది.

3. వాయిస్ కమాండ్‌తో ఇంగ్లిష్, ఫారిన్ ఇంగ్లిష్ ఎలాంటి భాషలో మాట్లాడినా, అలాగే నెట్ కనెక్షన్ బాగా లేకపోయినా ఇది పని చేస్తుంది. 5జి సేవలు వినియోగించుకునేలా ఇందులో మినీ నుంచి నానో వరకు నాలుగు సిమ్‌లు వేసుకోవచ్చు. సిస్కో, ఎయిర్‌టెల్ సహకారం తీసుకుంటున్నారు.

4. ఇండియాలో మొదటిసారి ఆటోమొబైల్ ప్లేయర్‌లో ఓవర్ ది ఎయిర్ (ఒటిఎ) టెక్నాలజీ అమర్చిన తొలి కారు ఇదేనని, దీని ద్వారా రియల్‌టైం సాఫ్ట్‌వేర్, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్, అప్లికేషన్ల అప్‌డేట్ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ నుంచి అప్‌డేట్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘ఈ-కాల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్’ ద్వారా ఒక ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే చాలు యాక్సిడెంట్, ఇతర అత్యవసర సమయాల్లో ‘పల్స్ హబ్’ అనే కస్టమర్‌కేర్‌కి ఆటోమేటిగ్గా ఫోన్ వెళ్లిపోతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నావిగేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తున్న కంపెనీ ‘టామ్‌టామ్’. 3డి నావిగేషన్, ఐక్యూ మ్యాప్‌ల ద్వారా వీళ్లు సేవలందిస్తారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.