(Local) Wed, 21 Aug, 2019

కియా నుంచి తొలికారు

July 16, 2019,   11:12 PM IST
Share on:

ఏపీలో ప్రతిష్టాత్మకంగా, అనంతపురం జిల్లా పెనుకొండలో కియా కార్ల తయారీ ప్లాంట్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ నుండి కియా నుంచి తొలికారు రాబోతోంది. కియా సెల్టోస్ పేరిట రూపుదిద్దుకున్న ఈ కొత్త కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కియా సెల్టోస్ ఆగస్టు 22న మార్కెట్లోకి రానుంది. ఆన్ లైన్లో కానీ, సేల్స్ సెంటర్ల నుంచి కానీ బుక్ చేసుకోవచ్చు. ప్రాథమికంగా రూ.25,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని కియా ప్రతినిధులు చెబుతున్నారు.ఎస్ యూవీ సెగ్మెంట్లో వస్తున్న కియా సెల్టోస్ ప్రధానంగా రెండు వెర్షన్లలో లభ్యం కానుంది. పెర్ఫార్మెన్స్ కోరుకునేవాళ్ల కోసం జీటీ లైన్, కుటుంబ ప్రయాణాల కోసం టెక్ లైన్ మోడళ్లలో రానుంది. పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో వస్తున్న సెల్టోస్ ను బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. దీని ధర విషయానికొస్తే, రూ.11 నుంచి రూ.17 లక్షల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.