(Local) Wed, 21 Aug, 2019

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ సూచనలు

May 20, 2019,   10:39 AM IST
Share on:

మానసిక ఆరోగ్యం, కేన్సర్‌, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులపై పాఠశాలలు, కాలేజీల్లో తరచుగా స్క్రీనింగ్  సెషన్లు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే నిర్ధారించడం, రోగులకు సకాలంలో చికిత్స అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్లకు రాసిన లేఖలో పేర్కొంది.

క్యాంప్‌సలను పొగాకు రహితంగా తీర్చిదిద్దడంతో పాటు క్యాంటీన్లలో చక్కెర పాళ్లు అధికంగా ఉండే పానీయాలు, జంక్‌ ఫుడ్‌ వంటి అనారోగ్యకరమైన ఆహారంపై నిషేధం విధించాలని కోరింది.పొగాకు ఉత్పత్తుల వినియోగం, మానసిక ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.వ్యాయామం, యోగా దిశగా యువతను ప్రోత్సహించడంతో పాటు క్యాంప్‌సల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.