(Local) Sun, 19 Sep, 2021

గూగుల్ పే రూపం లో సైబర్ మోసాలు

August 01, 2019,   12:44 PM IST
Share on:
గూగుల్ పే రూపం లో సైబర్ మోసాలు

మీరు గూగుల్ పే వాడుతున్నారా? గూగుల్ పే తో ఏదయినా సమస్య వస్తే మీరు నిజమైన కస్టమర్ కేర్ వాళ్ళనే సంప్రదిస్తున్నారా? ఇంటర్నెట్లో చాలా మోసపూరిత నంబర్లు వున్నాయి. జాగ్రత్త అని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. వారి మాటల్లోనే ప్రజలకు అర్థం అయ్యేలా ఈ విధంగా చెబుతున్నారు. 'రాము తన స్నేహితుడి నెంబర్ కి బదులు వేరొక నెంబర్ కి గూగుల్ పే ద్వారా 2000 పంపించాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని గూగుల్ పే కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఇంటర్నెట్ లో వెతికి, ఈ నెంబర్ 9330157851 కి ఫోన్ చేసి రాము తన తప్పుని చెప్పి రిఫండ్ చేయమన్నాడు. కస్టమర్ కేర్ వాళ్ళు రాముకి ఒక నీలిరంగు లింకు ఉన్న మెసజీ పంపి దాన్ని క్లిక్ చేసి గూగుల్ పే ఖాతా వివరాలు ఇవ్వమంటే రాము ఇచ్చాడు. వెంటనే రాము ఖాతా నుండి 4 సార్లు మొత్తం రూ.90,000 సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లాయి. గూగుల్ పే లో మీకు ఏవైనా ఇబ్బందులు వస్తే టోల్ ఫ్రీ నంబర్లు 18004190157 లేదా 18002582554 కి కాల్ చేయండి. ఇంటరాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ (ఫోన్లో 1 నొక్కండి లేదా 2 నొక్కండి అని చెప్తారు కదా! ఆ విదంగా) వస్తేనే నమ్మండి. గుర్తుంచుకోండి గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్లు పై రెండు మాత్రమే, మిగతా వేటినీ నమ్మవద్దు' అని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.