(Local) Wed, 24 Jul, 2019

ప్రారంభ స్థాయి ఉద్యోగులకు ప్యాకేజీని పెంచిన కాగ్నిజంట్‌

May 30, 2019,   10:47 AM IST
Share on:

అమెరికా ఐటి దిగ్గజం కాగ్నిజంట్‌కు భారత్‌లో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే సంవత్సరం నుంచి సంస్థలో చేరిన ప్రారంభ స్థాయి ఉద్యోగులకు వేతన ప్యాకేజీని 18 శాతం పెంచాలని కంపెనీ నిర్ణయించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2020 జూన్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులకు కంపెనీ ప్యాకేజీని రూ.3.38 లక్షల నుంచి రూ.4లక్షలకు పెంచనుందని తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో క్యాంపస్‌లను సందర్శించనున్నామని, వచ్చే ఏడాదికి గాను వారికి ఆఫర్ లెటర్లను ఇవ్వనున్నామని ఐటి కంపెనీ ప్రకటించింది. డిజిటల్ టెక్నాలజీలో ప్రీమియం స్కిల్స్‌ను కల్గిన ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే అత్యధిక వేతనాలను ఆఫర్ చేసిందని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘ఇదే విధంగా ప్రారంభ స్థాయి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించాం. ఇంజినీరింగ్‌లో డిజిటల్ టెక్నాలజీ ఓ భాగంగా మారింది. దీనికి మేము టాలెంట్‌ను గుర్తించి ఆఫర్ లెటర్లను అందిస్తాం’ అని సంస్థ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.