(Local) Sat, 04 Apr, 2020

మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసే బెస్ట్ యాప్... షాజమ్

October 22, 2019,   11:04 AM IST
Share on:
మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసే బెస్ట్ యాప్... షాజమ్

ఈ భూప్రపంచంలో సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండకపోవచ్చు. ఒత్తిడిని సైతం తగ్గించగల సామర్థ్యం సంగీతానికి ఉంది. మన రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఎన్నోరకాల మ్యూజిక్‌లను వింటుంటాం. మన చుట్టుపక్కల ప్లే అయ్యే మ్యూజిక్స్‌లో కొన్ని మ్యూజిక్స్ మనకు విపరీతంగా నచ్చేస్తుంటాయి. ఆ లిరిక్స్ ఎక్కడివో తెలుసుకుని మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంటుంది. మనకు తెలియని మ్యూజిక్ ఏదైనా ప్లే అవుతున్నప్పుడు మన చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆ మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసి అదే మ్యూజిక్‌ను మన ఫోన్‌లోనూ ఆస్వాదించవచ్చు. మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసేందుకు అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో బెస్ట్ యాప్ ను ఇప్పుడు తెలుసుకుందాం..
సంగీత ప్రియులు ఎంతగానో అభిమానిస్తోన్న యాప్‌లలో షాజమ్ ఒకటి. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నారు. లిరిక్స్‌ను క్యాచ్ చేసేందుకు ఇదొక బెస్ట్ యాప్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత దగ్గరలోని ఏదైనా పాట ప్లే అవుతుండగా యాప్లోని సర్చింగ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఆ పాట మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ప్లే అవుతుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.