(Local) Sat, 04 Apr, 2020

బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్

November 05, 2019,   11:17 AM IST
Share on:
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రూ.599తో రీచార్జ్ చేసుకున్న వారికి రూ.4లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీనికోసం భారతి ఆక్సాలైప్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టింది. దీని ద్వారా ఎయిర్‌టెల్  ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు  ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తుంది. ఈ ప్లాన్‌ 84 రోజుల వరకు ఉంటుంది. ప్రతి రీఛార్జితో 3 నెలల వరకు బీమా కవర్ ఆటోమాటిక్‌గా కొనసాగుతుంది. 18 నుంచి 54 ఏళ్ల వయస్సు గల వినియోగదారులందరికీ లభించే ఈ జీవిత బీమా సౌకర్యానికి ఎలాంటి వైద్య పరీక్షలు,  ధృవీకరణ పత్రం అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్‌ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని ఎయిర్‌టెల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్,  సీఈవో వాణి వెంకటేష్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.