(Local) Mon, 26 Aug, 2019

భారత మార్కెట్లోకి స్పోర్ట్స్‌ యాక్టివిటీ బీఎండబ్ల్యూ ఎక్స్‌7!

July 26, 2019,   6:19 PM IST
Share on:

బీఎండబ్ల్యూ కార్ కనపడగానే అలవోకగా చూస్తూనే ఉంటాం. అలాంటి బీఎండబ్ల్యూ కార్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి వెలువడింది. కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లోకి స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికిల్‌ ఎక్స్‌7ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.98.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). దీంతోపాటు 7 సీరీస్‌ సెడాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్లతో కూడిన కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ధరల శ్రేణి రూ.1.221.34 కోట్లుగా ఉంది. 7 సీరీస్‌ సెడాన్‌లో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ను కూడా తెచ్చింది. దీని ధర రూ.1.65 కోట్లు (పెట్రోల్‌), రూ.2.42 కోట్లు (డీజిల్‌)గా ఉంది. ఎక్స్‌7లో డీజిల్‌ వేరియంట్‌ను చెన్నైలోని ప్లాంట్‌లోనే తయారు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. పెట్రోల్‌ వెర్షన్‌ను మాత్రం కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌ యూనిట్‌ (సీబీయూ)గా దిగుమతి చేసుకోనున్నట్టు వెల్లడించింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.