(Local) Thu, 21 Nov, 2019

154 రూపాయలకే 190 టివి చానెళ్లు

August 14, 2019,   1:09 PM IST
Share on:
154 రూపాయలకే 190 టివి చానెళ్లు

ప్రభుత్వ కేబుల్‌ టీవీలో రూ.154 చెల్లిస్తే ప్రసారం కానున్న చానళ్ల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. ప్రభుత్వ కేబుల్‌ టీవీ ప్రసార చానళ్లను 36 లక్షల మంది వినియోగదారులు వినియోగిస్తున్నారు. వీరికి సేవలందించేందుకు 20 వేల మందికి పైగా కేబుల్‌ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. కేబుల్‌ టీవీ చార్జీలు తగ్గించాలని ఆపరేటర్లు, వినియోగదారులు కోరడంతో చార్జీలను రూ.130కి తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ చార్జీతో ప్రసారం చేయనున్న చానెళ్ల జాబితాను కేబుల్‌ టీవీ సంస్థ విడుదల చేసింది. దీని గురించి కేబుల్‌ ఆపరేటర్లు మాట్లాడుతూ..కేబుల్‌ టీవీ నెల చార్జీలో రూ.130 తగ్గిందని, దీంతో ఎన్ని చానళ్లు ప్రసారమవుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి భావాలను దృష్టిలో పెట్టుకుని నెల చార్జీ రూ.130తో జీఎస్టీ కలిపి రూ.154కు 190 చానెళ్లను ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. ఇందులో ఆంగ్లం, తెలుగు సహా ఇతర భాషా చానెళ్లు చోటు చేసుకుంటాయని తెలిపారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.