(Local) Tue, 18 Jun, 2019

ప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి వైసీపీ షాక్

June 06, 2019,   3:11 PM IST
Share on:

ప్రజావేదిప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి అనుకోని షాకిచ్చింది వైసీపీ. ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజా వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు నిన్న సీఎం జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కానీ గంటల వ్యవధిలోనే ప్రజావేదికను తమ పార్టీ కార్యక్రమాలకు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ కోరింది.  చంద్రబాబు లేఖ రాసిన వెంటనే వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఎంటరయ్యారు. పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని కోరారు. దీనిని తమకు కేటాయిస్తే పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ నిర్వహించే సమావేశాలకు జగన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతారని, ఆయన భద్రతకు, ట్రాఫిక్‌కు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన వివరించారు. కాబట్టి ప్రజావేదికను తమకే కేటాయించాలని సీఎస్ ను కోరారు. ప్రజావేదిక అక్రమ కట్టడమని అధికారులు నిర్ధారిస్తే.. తక్షణమే ఖాళీ చేసి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నేత చీఫ్ విప్‌కు హామీ ఇచ్చారు. అధికార పార్టీ వినతి పట్ల సీఎస్ సానుకూలంగా స్పందిస్తే.. ఇక నుంచి బాబు నివాసం పక్కనే వైఎస్ఆర్సీపీ అధినేత హోదాలో సీఎం జగన్ తన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తారన్నమాట. ప్రజావేదికను తమకంటే తమకు కేటాయించాలంటూ ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ కోరుతుండడంతో ఈ విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.