(Local) Mon, 22 Jul, 2019

వ్యవసాయశాఖపై ఏపి సిఎం జగన్‌ సమీక్ష

June 06, 2019,   2:16 PM IST
Share on:

ఈ రోజు తాడేపల్లిలోని ఏపి సియం జగన్‌ తన నివాసంలో వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా జగన్‌ మాట్లాడుతూ..అక్టోబరు 15 నుంచి రైతు భరోసాను ప్రారంభిస్తామని, రైతులకు రూ. 12,500 నగదు ఇస్తామని, అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నామని తెలిపారు. నకిలి విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు కూడా వెనకడుగు వేయవద్దని , విత్తన చట్టం తేవాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ జరగాలన్నారు. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని సూచించారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా సాయమందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.