(Local) Sat, 06 Jun, 2020

కశ్మీర్‌లో అల్లరి మూకలు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు

June 06, 2019,   4:03 PM IST
Share on:
కశ్మీర్‌లో అల్లరి మూకలు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు

కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం రంజాన్ పర్వదినాన కూడా అల్లరి మూకలు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు సంభవించాయి. క్షత గాత్రలు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్రంలోని మసీదులు, ముస్లింల పుణ్య క్షేత్రాల్లో ఈద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్ ప్రార్థనలు ముగియగానే శ్రీనగర్ పాత నగరంలో అల్లరి మూకలు సైనికులపై రాళ్లు రువ్వారు. ఉత్తర కశ్మీర్ సోపోర్, దక్షిణ కశ్మీర్ అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి అల్లర్లు సంభవించాయని అధికార్లు వెల్లడించారు.శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ముసుగుల్ని ధరించిన కొందరు జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్,ఇటీవల హతమైన మిలిటెంట్ జాకీర్ మూసాలకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారని చెప్పారు. శాంతి భద్రతల నియంత్రణకు భద్రతా దళాల్ని అప్రమత్తం చేసినట్లు వివరించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.