(Local) Mon, 23 Sep, 2019

రేపు ఢిల్లీ కి జగన్..అమిత్ షా తో భేటీ

August 25, 2019,   11:55 AM IST
Views: 73
Share on:
రేపు ఢిల్లీ కి జగన్..అమిత్ షా తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 8గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. సీఎం జగన్ వెంట పలువురు మంత్రులు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలస్తోంది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘం సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించి, పెండింగ్ నిధులను మంజూరు చేయాలని కోరనున్నారు. 
అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న జగన్, సాయంత్రం అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో హైకోర్టు తీర్పు, తాజా రాజకీయాలపై చర్చించారు. తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, తదితర విషయాలపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

సంబంధిత వర్గం
ఇక ఒకే గుర్తింపు కార్డు..!
ఇక ఒకే గుర్తింపు కార్డు..!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.