(Local) Wed, 21 Oct, 2020

స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున్నారు: యనమల

November 21, 2019,   6:53 PM IST
Share on:
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

స్వార్థం, అవివేకంతో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కీడు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సింగపూర్, అబుదాబి, జపాన్, అమెరికా, కెనడా దేశాల్లో ఏపీ విశ్వాసాన్ని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. 6నెలల వైసీపీ పాలనలో 9 మోసాలు చేశారని మండిపడ్డారు. పెట్టుబడులు పోగొట్టడమే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. జగనన్న విద్యా వసతి మరో జగన్మాయ అంటూ ఎద్దేవా చేశారు. ఫించన్ లో రూ.750 ఎగ్గొట్టి వృద్దులను దారుణంగా మోసగించారన్నారు. పాత పథకాలకే కొత్తపేరు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.