(Local) Fri, 23 Jul, 2021

జగన్ ప్రభుత్వానికి పారదర్శకత లేదు

September 14, 2019,   2:22 PM IST
Share on:
జగన్ ప్రభుత్వానికి పారదర్శకత లేదు

జగన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనపై జనసేన పార్టీ రూపొందించిన నివేదికలోని మూల అంశాలను ఈ రోజు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా ముందుంచారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రకటించిన నవరత్నాలు జనరంజకమైనవే కానీ వైసీపీ పాలన మాత్రం జన విరుద్ధమైనదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సంవత్సరం వరకు మాట్లాడే అవకాశం రాదనుకున్నాం. రెండు వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయి. ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధిని ప్రశ్నార్థకం చేశాయి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ విఫలం అయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన పై పవన్ కళ్యాణ్ పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 9 అంశాల పై 10 టీమ్ ల తో సర్వే చేశామని ఆ వివరాలనే ఇప్పడు వెల్లడిస్తున్నామని ఆయన అన్నారు. ఇసుక, అమరావతి రాజధాని అనిశ్చితి , గృహనిర్మాణం, తదితర అంశాలు, అశాంతి, శాంతిభద్రత లు ,రైతాంగం అంశాలు గురించి సర్వేలో ప్రస్తావన చేశామని ఆయన తెలిపారు. వైసిపి పాలన పారదర్శకత లేని విధంగా ఉందని ఆయన అన్నారు. సుమారు 50 రహస్య జీఓ లు జారీ చేసారని ఆయన తెలిపారు.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.