(Local) Mon, 23 Sep, 2019

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచండి - కేసిఆర్

August 24, 2019,   11:43 AM IST
Views: 53
Share on:
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచండి  ...

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో ఆయకట్టుకు నీరు ఇవ్వాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ఇఎన్‌సి మురళీధర్, చీఫ్ ఇంజనీర్ రమేష్‌లతో సిఎం సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి, నీళ్లు ఇచ్చే స్థాయికి తీసుకువచ్చినట్లుగా, పాలమూరు రంగారెడ్డిని సైతం పూర్తిచేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లో మిగిలిన పనులు పూర్తిచేస్తే జిల్లాలోని సగానికి పైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, మిగతా సగం భూములకు పాలమూరు ఎత్తిపోతలతో నీరు ఇవ్వాలని ఆదేశించారు. పనుల పురోగతిని తెలుసుకునేందుకు సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

సంబంధిత వర్గం
కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి....
కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.