(Local) Sat, 24 Jul, 2021

మంత్రి బొత్సను నిలదీసిన కార్మికులు

October 26, 2019,   11:45 AM IST
Share on:
మంత్రి బొత్సను నిలదీసిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్య నారాయణను భవన నిర్మాణ కార్మికులు నిలదీశారు. శనివారం ఉదయం గుంటూరు నగరంలో పర్యటించిన మంత్రిని కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక దొరకని కారణంగా పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపిస్తే తమకు పనులు లేకుండా చేశారని, ఇప్పుడు తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. భూగర్భ డ్రైనేజీలు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం డ్రైనేజీ పనులను ప్రారంభించారని, ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదన్నారు. పద్ధతి లేకుండా రోడ్లను వేయడం వల్లే దారుణంగా తయారయ్యాయని, రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో రోడ్ల పరిస్థితి ఇలా ఉండకూడదని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.