(Local) Sat, 19 Oct, 2019

హైదరాబాద్‌ మెట్రో ఓ ప్రాణం తీసింది....

September 22, 2019,   7:48 PM IST
Share on:
హైదరాబాద్‌ మెట్రో ఓ ప్రాణం తీసింది....

హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన మెట్రో రైల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్నిరకాలుగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ.. పటిష్టమైన నిర్మాణం చేశామని అధికారులు చెబుతున్నా.. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యమే.. కాంట్రాక్టరు చేతివాటమే.. నిర్మాణంలో జరిగిన వైఫల్యమే... కానీ, వివాహమై రెండు నెలలు తిరగకుండానే ఓ మహిళ కన్నుమూసింది. వివరాల్లోకి వెళ్తే అమీర్‌పేట మెట్రోస్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి వివాహిత మౌనిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కూకట్‌పల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. తన బైక్‌ను పక్కనే పార్క్ చేసి సారథి స్టూడియోస్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర కింద తన సోదరితో కలిసి నిల్చుంది మౌనిక.. అయితే, ఇదే సమయంలో పైనుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తీవ్రగాయాలతో మౌనిక పరిస్థితి విషమించడంతో.. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేసరికి ఆమె ప్రాణాలు పోయాయి. మౌనిక స్వస్థలం మంచిర్యాల.. నెలన్నర క్రితమే ఆమె వివాహమైంది. ఓవైపు భర్త, మరోవైపు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మెట్రో అధికారుల నిర్లక్ష్యంపై హైదరాబాదీలు మండిపడుతున్నారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.