(Local) Sat, 10 Apr, 2021

రోడ్డు ప్రమాదంలో మహిళా టెకీ మృతి

November 26, 2019,   8:26 PM IST
Share on:
రోడ్డు ప్రమాదంలో మహిళా టెకీ మృతి

హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నంబర్12లో మంగళవారం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హోండా యాక్టివా మీద వెళుతున్న మహిళను బర్కత్ పుర డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తల పై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె తల మొత్తం చిద్రమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. యాక్టివా వాహనం బస్సు చక్రాల కింద పడి నుజ్జు నుజ్జయ్యింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ ను చితకబాదారు. చనిపోయిన మహిళను సోహిని సక్సేనాగా పోలీసులు గుర్తించారు. ఈమె టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. సక్సేనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సక్సేనా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బయోడైవర్సిటి ప్రమాదం మర్చిపోకముందే ఈ ప్రమాదం జరగడంతో హైదరాబాద్ లో విషాదం నెలకొంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.