(Local) Fri, 30 Oct, 2020

జల్లికట్టు పోటీల వీక్షణకు ప్రధాని మోడీని ఆహ్వానిస్తాం

November 14, 2019,   1:37 PM IST
Share on:
జల్లికట్టు పోటీల వీక్షణకు ప్రధాని మోడీని ఆహ్వానిస్ ...

తమిళనాడులోని మదురై చింతామణి ప్రాంతం నుంచి నిర్వహించనున్న జ్యోతి పాదయాత్రను ఆ రాష్ట్ర మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమిళుల సంప్రదాయ సాహసక్రీడ అయినా జల్లికట్టును వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం తరపున ఆహ్వానించనున్నట్టు తెలిపారు. అభివృద్ధి బాటలో పయనిస్తూ మంచి పథకాలను అమలుపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ విజయాల వాస్తవికతను తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో పొంగల్‌ పండుగ సందర్భంగా నిర్వహించే తమిళుల సంప్రదాయ సాహసక్రీడ జల్లికట్టును మదురై జల్లా అలంగానల్లూరులో వీక్షించేందుకు రావలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని, ఈ విషయమై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్ని ప్రయత్నాలు చేపట్టారని చెప్పారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.