(Local) Fri, 22 Nov, 2019

పాలమూరు ప్రాజెక్టు సంవత్సరంలోపు పూర్తి :కేసీఆర్

August 29, 2019,   4:54 PM IST
Share on:
పాలమూరు ప్రాజెక్టు సంవత్సరంలోపు పూర్తి :కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “గోదావరి, కృష్ణా నదులను కలిపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడాదిలోపు పాలమూరు ప్రాజెక్టు పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు మళ్లీ కిరికిరి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక అది నడవవు. ఆయన ఓడినా ఆయన అల్ప బుద్ది మారడం లేదు. మహారాష్ట్రతో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. తెలంగాణలో కూడా కొంత మంది దద్దమ్మలు, సన్నాసులు అడ్డుపడుతున్నారు. మేం చేయలేదు కాబట్టి మీరు కూడా చేయవద్దన్న ధోరణితో ఆలోచిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేసింది ఇదే కాంగ్రెస్ వారు కదా. అప్పుడు వారికి సోయిలేదా. వారు సరిగా చేసి ఉంటే పాలమూరు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా మారకపోవును. ఎవరూ కూడా బొంబాయికి బాట పట్టకపోదురు.

తెలంగాణ రైతు ప్రతి ఒక్కరు అప్పుల్లో ఉన్నారు. వారి గురించి ఆలోచించే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కొంత మంది కరెంట్ బిల్లులు ఇంతనా అని అంటున్నారు. ఆరు నూరైనా సరే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. కాంగ్రెస్ నేతల కేసుల వల్లే పాలమూరు ప్రాజెక్టు ఆలస్యమయ్యింది. పాలమూరు పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మన రాష్ట్రంలో ఉన్న పంపుసెట్లు దేశంలోనే లేవు. పాలమూరును పాలు కారే భూమిలా తయారు చేస్తాం. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం పూర్తవుతదా అని అన్నారు. ఇప్పుడు బ్రహ్మండంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. ప్రపంచమంతా కాళేశ్వరాన్ని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నాయకులు గుడ్లు తేలేస్తున్నారు. సంవత్సరంలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాం.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

సంబంధిత వర్గం
ఆర్టీసీపై సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
ఆర్టీసీపై సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.