(Local) Thu, 14 Nov, 2019

మూడేళ్లలో రాష్ట్ర పరిస్థితులన్నీ మార్చేస్తా - జగన్

October 03, 2019,   11:30 AM IST
Share on:
మూడేళ్లలో రాష్ట్ర పరిస్థితులన్నీ మార్చేస్తా - జగన్

తూర్పుగోదావరి జిల్లా కరపలో బుధవారం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో రాష్ట్ర పరిస్థితులన్నీ మార్చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో లంచం లేనిదే పనిజరిగేది కాదన్నారు. రేషన్ కార్డుకు లంచం, మరుగుదొడ్డికి లంచం, కొత్త ఇల్లుకు లంచం, పెన్షన్ల కోసం లంచాలు తీసుకుని ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు.
నాకు మూడేళ్లు సమయం ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తానని చెప్పారు. ఏడాదిలో 15వేల స్కూళ్ల చొప్పున మెరుగు పరిచి, గ్రామ సచివాలయాల్లో నాడు, నేడు ఫోటోలు పెడతామన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఆకాంక్షతోనే అమ్మఒడి పథకం తీసుకువస్తున్నామని, జనవరి 26 నుంచి ప్రతి తల్లికి రూ.15వేలు ఇస్తామని చెప్పారు.
టీడీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోయిన సంఘటనలు చూశామన్నారు. ఏడాదికి కొన్ని ఆస్పత్రుల చొప్పున మెరుగుపరుచుకుంటూ పోతూ మూడేళ్లలో ఆస్పత్రుల్నింటిలో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పీహెచ్ సీ భవనాలను నిర్మించి చరిత్ర మారుస్తామని చెప్పారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.