(Local) Sat, 24 Jul, 2021

మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సౌకర్యం: పీయూష్ గోయల్

October 23, 2019,   8:03 PM IST
Share on:
మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సౌకర్యం: పీయూష్  ...

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది చాలా క్లిష్టమైన సాంకేతికతకు సంబంధించిన విషయమని, ఇందుకోసం విదేశీ సాంకేతికత, పెట్టబుడులు అవసరం అవుతాయని అన్నారు. కదులుతోన్న రైళ్లలో వైఫై అందించడానికి పెట్టుబడులతో పాటు టవర్ల ఏర్పాటు, ఇందుకు తగ్గ సామగ్రి అవసరం ఉంటుందని చెప్పారు. అయితే, రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి కంపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ లకు లైవ్ ఫీడ్ అందుతుందని, వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని అన్నారు. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తామని గోయల్ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.