(Local) Sat, 23 Jan, 2021

రాహుల్ కాశ్మీరులో పర్యటించేందుకు ఎందుకు అనుమతించలేదు?

October 29, 2019,   4:06 PM IST
Share on:
రాహుల్ కాశ్మీరులో పర్యటించేందుకు ఎందుకు అనుమతించలే ...

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబాబ ముఫ్తీ కాశ్మీర్‌లో పర్యటించేందుకు యూరోపియన్ యూనియన్ కు చెందిన 28 మంది ఎంపీల బృందానికి కేంద్రం మంగళవారం అనుమతించిన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎందుకు అనుమతించలేదని కేంద్రాన్ని నిలదీశారు. మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉండటంతో ఆమె ఇచ్చిన ప్రకటనను కుమార్తె ఇల్తీజా ముఫ్తీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాహుల్ గాంధీ కాశ్మీర్ లో పర్యటించకుండా అడ్డుకున్న కేంద్రం దూరంగా ఎక్కడో ఉన్న యూరోపియన్ ఎంపీల బృందానికి ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్ లు శ్రీనగర్ వచ్చిన వారిని ఇక్కడి నుంచి ఢిల్లీ విమానంలో బలవంతంగా ఎక్కించి పంపించారని ఆమె ఆరోపించారు. ఈయూ బృందం మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లాలను కలిసేందుకు అనుమతించక పోవడంపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయూ బృందం జమ్మూకశ్మీర్ కు చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను కలవకుండా వెళ్లడాన్ని ఆమె తప్పుబట్టారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.