(Local) Sat, 24 Jul, 2021

గుండెపోటు వస్తే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు: బొత్స

September 17, 2019,   11:06 AM IST
Share on:
గుండెపోటు వస్తే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకె ...

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయని, ఆయన మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాలని చెప్పారు. కోడెల గుండెపోటుకు గురైతే అపోలో, కిమ్స్, నిమ్స్, కేర్ ఆస్పత్రులకు తీసుకెళ్లకుండా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కుటుంబ కలహాల వల్ల సూసైడ్ చేసుకున్నాడా, మరెదైనా కారణం ఉందా అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరపాలన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే కోడెల ఉరి వేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. కోడెలపై ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదని స్థానికంగా ఉన్న నేతల ఫిర్యాదు ఆధారంగానే కేసులు పెట్టారన్నారు. వైసీపీ సర్కార్ కు శవరాజకీయాలు చేయడం తెలియవన్నారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

సంబంధిత వర్గం
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.