(Local) Sat, 24 Jul, 2021

రేవంత్ రెడ్డి సూచించిన కిరణ్ కుమార్ ఎవరంటే!

September 19, 2019,   3:20 PM IST
Share on:
రేవంత్ రెడ్డి సూచించిన కిరణ్ కుమార్ ఎవరంటే!

ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే హుజూర్ నగర ఉప ఎన్నికపై రాజకీయం రగులుకుంది. ఈ సీట్ లో తన భార్య పద్మావతి రెడ్డి పోటి చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పద్మావతి స్థానంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో ఈ స్థానం అభ్యర్థి ఎవరన్న దానిపై మరో సారి ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ రేవంత్ రెడ్డి సూచించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.

చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చెందిన వ్యక్తి. రాహుల్ గాంధీ టీమ్ లో యువజన నాయకుడిగా చురుకుగా పాల్గొన్నాడు. కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా సన్నిహితుడు. ఇటీవల రేవంత్ వర్గంలోకి జంపయ్యారనే టాక్ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున సీట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశాడు. హై కమాండ్ కు కూడ విజ్ఞప్తి చేసుకున్నట్లు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా ప్రకటించారు. తాజాగా రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతుండటంతో హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి అంశం మళ్లీ మొదటికి వచ్చిందనట్లైంది.

సంబంధిత వర్గం
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు - రేవంత్ రెడ్డి
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు - రేవంత్ రెడ్డి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.