(Local) Sun, 20 Oct, 2019

తెలంగాణలో జల దోపిడీ : సోమారపు

August 25, 2019,   12:33 PM IST
Share on:
తెలంగాణలో జల దోపిడీ : సోమారపు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. గోదావరి పరిసర ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా ఎక్కడికో తరలిస్తున్నారని మండిపడ్డారు. అనవసరమైన రిజర్వాయర్లు కట్టి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను జలదోపిడీ కాకుంటే ఏమంటారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్రవాళ్లు జలదోపిడీ చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా అదే జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. జలదోపిడీని ఆపకపోతే ప్రజలే సరైన సమాధానం చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తోందా అన్న సందేహం కలుగుతుందని విమర్శించారు.

సంబంధిత వర్గం
ఆర్టీసి సమ్మె.. సర్కార్ కు అందిన హైకోర్టు కాపీ
ఆర్టీసి సమ్మె.. సర్కార్ కు అందిన హైకోర్టు కాపీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.