(Local) Fri, 22 Oct, 2021

పాకిస్తాన్ పై రాహుల్ తీవ్ర విమర్శలు

August 28, 2019,   11:15 AM IST
Share on:
పాకిస్తాన్ పై రాహుల్ తీవ్ర విమర్శలు

పాకిస్థాన్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్ లో హింస ఉందనే విషయం నిజమేనని… అయితే, దీనికి పాకిస్థానే కారణమని అన్నారు. కశ్మీర్ లో హింస చోటు చేసుకునేలా పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని చెప్పారు. ఒక్క కశ్మీర్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులకు పాక్ మద్దతు ఇస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో విషయాలలో పాకిస్థాన్ ప్రభుత్వంతో తాను ఏకీభవించలేనని చెప్పారు. పాకిస్థాన్ కు ఒక్క విషయాన్ని తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని… కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తెలిపారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, మరే దేశానికి తావు లేదని చెప్పారు.

సంబంధిత వర్గం
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.