(Local) Mon, 27 Sep, 2021

తెలంగాణ ఆర్టీసి సమ్మెకు ప్రవాస భారతీయులు మద్దతు

November 11, 2019,   1:18 PM IST
Share on:
తెలంగాణ ఆర్టీసి సమ్మెకు ప్రవాస భారతీయులు మద్దతు

తెలంగాణ ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ప్రవాస భారతీయులు నిలిచారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మాజీ ఎంపి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్న తరుణంలోనే తెలంగాణ ఆర్టీసిని రక్షించాలి..రక్షించాలి అంటూ నినాదాలు చేశారు సభకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలు. ఈ హఠాత్‌ పరిణామానికి ఆశ్చర్యపోవడం వినోద్‌ వంతయింది. ఈ నేపథ్యంలో కాసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. కాగా నిర్వహకులు సర్ది చెప్పడంతో ఆందోళన సర్దుమనిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.