(Local) Tue, 29 Sep, 2020

దుర్గమ్మ సన్నిధిలో తప్పిన ప్రమాదం

August 02, 2019,   10:45 AM IST
Share on:
దుర్గమ్మ సన్నిధిలో తప్పిన ప్రమాదం

బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము వద్ద ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షానికి 2017 సంలో నిర్మించిన మహామండపము 7 వ అంతస్థులో ఉన్న ఆలయ కార్యనిర్వహణాధికారి  కార్యాలయము పాక్షికముగా దెబ్బతిన్నది. కార్యాలయము లోపలి వైపు ఉన్న కిటికీలు ఊడి కిందపడ్డాయి. కార్యాలయ సీలింగ్  పెచ్చులు ఊడిపోయి క్రింద పడ్డాయి. అదే సమయములో ఈవో కోటేశ్వరమ్మ, ఐ.ఆర్.ఎస్ హాలులోకి వస్తుండగా ఆ సీలింగ్ పెచ్చులు ఈవో కోటేశ్వరమ్మ తలపై బలముగా పడ్డాయి. ఈవో సీసీ సుబ్రహ్మణ్యం  వెంటనే స్పందించి దేవస్థానములో డ్యూటీలో  ఉన్న డాక్టర్  కనకారావుని పిలిపించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం టాబ్లెట్లు అందజేసారు. అదే సీలింగ్ పెచ్చులు మరింత పెద్దవి పడి ఉంటే అనుకోని ప్రమాదము జరిగి ఉండేదని త్రుటిలో కార్యనిర్వహణాధికారికి పెను ప్రమాదం తప్పినదని ఆ సమయములో అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారు.​ ఏదైనా అంతా ఆదుర్గమ్మ చల్లని చూపేనని అంటున్నారు.

సంబంధిత వర్గం
జగన్ తో విజయవాడ రోడ్లపై  కొట్లాటకూ నేను రెడీ.. పవన ...
జగన్ తో విజయవాడ రోడ్లపై కొట్లాటకూ నేను రెడీ.. పవన ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.