(Local) Thu, 16 Jul, 2020

మాకు మోడీ- అమిత్ షా అండదండ ఉన్నాయి - విజయ్ సాయి రెడ్డి

August 22, 2019,   3:46 PM IST
Share on:
మాకు మోడీ- అమిత్ షా అండదండ ఉన్నాయి - విజయ్ సాయి రె ...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొనే కీలక నిర్ణయాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను సంప్రదించాకే తీసుకుంటారని  ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి అన్నారు . పోలవరం రివర్స్ టెండర్లు, పీపీఏలపై సమీక్షల్లోనూ మోడీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దోచుకుతిన్నదని, అవినీతి నివారణలో మా సంకల్పానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయన్నారు. నిన్న  న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు భేటీ తరువాత ఆయన  మీడియాతో మాట్లాడుతూ... రాజధానిని మారుస్తామని ప్రభుత్వం ప్రకటించలేదని, కొండవీటి వాగు వల్ల  రాజధాని ప్రాంతంలో వరద ముంపుందన్నారు.  అయితే ఈ వరదను నివారించేందుకు ఏం చేయాలనే దానిపై  ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. రాజధాని మార్చుతున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబు హయంలో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయంలో తమకు కేంద్రం సహకారం కూడ ఉందని ఆయన చెప్పారు. రాజధానిపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు చెబుతుంది కదా అని విజయసాయి అన్నారు.  

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.