(Local) Wed, 03 Jun, 2020

అవినీతి చిక్కుముడి విప్పగలరా? - జగన్ కి వర్ల రామయ్య ట్విట్

August 08, 2019,   3:42 PM IST
Share on:
అవినీతి చిక్కుముడి విప్పగలరా? - జగన్ కి వర్ల రామయ్ ...

టీడీపీ నేతలు జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌ పీఏ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్ చేశారు. “ముఖ్యమంత్రి గారు! మంత్రి బాలినేని గారి పీఏ భీమేష్. మంత్రి గారి పేరుతో ఎన్నో అవకతవకలకు, అవినీతికి పాల్పడి దొడ్డిదారిన ఉద్యోగాలు, బదిలీలు, ఫోర్జరీలు చేసినట్లు లోకం కోడై కూస్తోంది. మంత్రి గారు పీఏ మీద ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు.. కారణం ఏంటి? ఈ అవినీతి చిక్కుముడి విప్పగలరా?” అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు. అయితే వర్ల ఆరోపణలపై మంత్రి బాలినేని ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.