(Local) Wed, 21 Oct, 2020

సీఎం జగన్ తో వల్లభనేని వంశీ భేటీ

November 27, 2019,   11:08 AM IST
Share on:
సీఎం జగన్ తో వల్లభనేని వంశీ భేటీ

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వల్లభనేని వంశీని.. మంత్రి కొడాలి నాని తీసుకెళ్లారు. వీరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేసిన వంశీ.. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయ్యారు. వైసీపీలో చేరి జగన్ కు సహకరిస్తానని వంశీ ప్రకటించిన నేపథ్యంలో ఇరువురు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో పది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీలో చేరిక అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.