(Local) Sat, 19 Sep, 2020

ఆ విషయంలో ఎప్పుడు మాది అదే అభిప్రాయం

August 09, 2019,   9:45 PM IST
Share on:
ఆ విషయంలో ఎప్పుడు మాది అదే అభిప్రాయం

కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌పాకిస్థాన్‌ ద్వైపాక్షిక అంశమని, ఇరుదేశాలు శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పుడూ, ఎప్పుడూ తమ అభిప్రాయం అదేనని తెలిపింది. వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టగస్‌ మాట్లాడుతూ చర్చలకు అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

కశ్మీర్‌తో సంబంధం ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాలు సంయమనం పాటించాలని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాము గమనిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్‌ ప్రధాని ఇటీవల అమెరికా పర్యటించినప్పుడు కశ్మీర్‌ అంశమే ప్రధానంగా సాగలేదని, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. కశ్మీర్‌లో భారత్‌ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాకిస్థాన్‌ ఆరోపణలపై మోర్గాన్‌ స్పందించేందుకు నిరాకరించారు. త్వరలో అమెరికా ప్రతినిధి భారత్‌లో పర్యటిస్తారని, ఈ సందర్భంగా అన్ని అంశాలు చర్చిస్తారని తెలిపారు.

సంబంధిత వర్గం
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.