(Local) Sun, 20 Oct, 2019

రీ టెండరింగ్ ద్వారానే పోలవరం పనులు : పెద్దిరెడ్డి

August 26, 2019,   3:58 PM IST
Share on:
రీ టెండరింగ్ ద్వారానే పోలవరం పనులు : పెద్దిరెడ్డి

పోలవరం ప్రాజెక్ట్ పనుల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. రీ టెండరింగ్ ద్వారానే పనులను కొనసాగిస్తామన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ప్రతి ఇంటికి నీరందించాలనే సంకల్పాన్ని కేంద్రమంత్రి వివరించారని, దీనిపై వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు.. వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టు ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పర్యటిస్తారని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
రివర్స్ టెండరింగ్ ల విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం
రివర్స్ టెండరింగ్ ల విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం
ఢిల్లీలో ఏపి అధికారుల భేటి
ఢిల్లీలో ఏపి అధికారుల భేటి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.