(Local) Sat, 24 Jul, 2021

వచ్చేనెలలో భారత్ కు బ్రిటన్ యువరాజు

October 29, 2019,   12:08 PM IST
Share on:
వచ్చేనెలలో భారత్ కు బ్రిటన్ యువరాజు

వచ్చేనెల 13 నుంచి రెండ్రోజుల పాటు బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ భారత్ లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇరు దేశాల విదేశాంగశాఖ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది. వాతావరణ మార్పు, స్థిరమైన మార్కెట్లు, ఆర్థిక అంశాలపై పలువురు అధికారులు ఛార్లెస్ తో చర్చలు జరపనున్నారు. రెండేళ్లలో చార్లెస్ మనదేశ పర్యటనకు రావడం రెండోసారి. 2018లో జరిగిన కామన్వెల్త్ దేశాల సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు 2017 నవంబర్ లో భారత్ వచ్చారు. ఇప్పటివరకు ఛార్లెస్ 9 సార్లు భారత్ ను సందర్శించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.