(Local) Mon, 30 Nov, 2020

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే

November 27, 2019,   11:34 AM IST
Share on:
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే

సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్ థాక్రేను ప్రకటించాయి. డిప్యూటీ సీఎంను చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలని నిర్ణయించారు. ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిలో జయంతి పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలా సాహెబ్ కొనసాగనున్నారు. ఈ మేరకు కూటమి నేతలు ప్రకటించారు. ట్రెండెంట్ హోటల్ లో సమావేశమైన మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. కూటమి నేతగా ఉద్దవ్ థాక్రేను ప్రకటించిన అనంతరం గవర్నర్ ను కలవనున్నారు.రేపు అసెంబ్లీలో బల నిరూపణ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. డిసెంబర్ 1 న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.