(Local) Fri, 25 Sep, 2020

యూఏఈలో మోడీకి అరుదైన గౌరవం

August 25, 2019,   12:40 PM IST
Share on:
యూఏఈలో మోడీకి  అరుదైన గౌరవం

విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ అరుదైన గౌరవం అందుకున్నారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, రాజులకు బహూకరించే అవార్డుకు మోడీ ఎంపికయ్యారు. శనివారం యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, మోడీని ఆర్డర్ ఆఫ్ జాయేద్ మెడల్ తో సత్కరించారు. ఇది యూఏఈలోనే అత్యున్నత పురస్కారమని యువరాజు తెలిపారు. భారత్, యూఏఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోడీ చేసిన కృషికి గాను బహుమతిని అందజేశామన్నారు. ఇంతకు ముందు ఈ పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, బ్రిటన్ రాణి ఎలిజబెత్, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అందుకున్నారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.