(Local) Fri, 23 Jul, 2021

కింగ్ ఫిషర్ బీర్ల పేరుతో.. ట్యూబర్గ్ బీర్ల అమ్మకం

November 28, 2019,   9:04 AM IST
Share on:
కింగ్ ఫిషర్ బీర్ల పేరుతో.. ట్యూబర్గ్ బీర్ల అమ్మకం

హయత్ నగర్ శ్రీ దుర్గ వైన్స్ లో నకిలీ మద్యం గోల్ మాల్ బయటపడింది. హయత్ నగర్ శ్రీ దుర్గ వైన్స్ లో కింగ్ ఫిషర్ బీర్ల స్టిక్కర్లతో ట్యూబర్గ్ బీర్లను అమ్ముతున్నారు. చాలా మంది కింగ్ ఫిషర్ బీర్లను తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న యాజమాన్యం ట్యూబర్గ్ బీర్లకు కింగ్ ఫిషర్ బీర్ల స్టిక్కర్లను అతికించి అమ్ముతుంది. బుధవారం ఓ వ్యక్తి బీర్లను కొనుగోలు చేయగా ఆ వ్యక్తి ఈ మోసాన్ని గుర్తించాడు. దీంతో వైన్స్ షాపు అసలు దందా బయటపడింది. దీని పై కొనుగోలు దారుడు రవితేజ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కొద్ది రోజుల క్రితం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కూడా ఈ దందా బయటపడింది. తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల క్రితం మద్యం నూతన లైసెన్స్ విధానం ప్రారంభమైంది. దీంతో కింగ్ ఫిషర్ బీర్ల సప్లై తక్కువగా ఉండడంతో వైన్స్ టెండర్లు దక్కించుకున్న వారంతా ఇదే దందాను కొనసాగిస్తున్నారని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుందని తెలుస్తోంది. దాదాపు కోట్ల రూపాయలు అక్రమంగా వైన్స్ షాపుల వారు దోచుకుంటున్నారని సమాచారం. ఎక్సైజ్, పోలీసు శాఖ వారికి చెప్పినా కూడా వారు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు మద్యం షాపుల పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.