(Local) Thu, 21 Nov, 2019

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా

August 26, 2019,   11:39 AM IST
Share on:
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా

తెలంగాణాలో తెలుగుదేశం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తెలంగాణాలో రాజకీయంగా గత పదేళ్ళ నుంచి నానా ఇబ్బందులు పడుతున్న ఆ పార్టీ ఇప్పుడు అస్తిత్వం కాపాడుకునే దిశగా, మళ్ళీ ప్రజాదరణ పొందే దిశగా అడుగులు వేస్తుంది. కీలకమైన అన్ని అనుబంధ విభాగాలను మళ్ళీ పటిష్ట పరిచే దిశగా అడుగులు వేసేందుకు గాను తెలుగుదేశం అధిష్టానం తెలంగాణాలో ముందు అడుగు వేస్తుంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తాము అని వాగ్ధానం చేసి విఫలమైనందున, ప్రజలకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. తెరాస మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి హామీ నేటిగా హామీగానే ఉంది. తెరాస నాయకులకి లాభం చేకూర్చే పనులు తప్ప ప్రజలకి పనికొచ్చే పనులు చేపట్టటం లేదని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తోడు పార్టీలో ఉన్న అనుబంధ విభాగాలని పటిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో ఒక శక్తిగా ఎదిగేందుకు ప్రజా పోరాటాలనే సాధ్యమని భావించి ప్రజలతో కలిసి ఉద్యమంలోకి దిగుతున్నారు. దీని ఆధారంగా చూస్తే ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్న అనుభంద విభాగాలను ఒక్కటి చేసి పార్టీని పటిష్ట పరిచే విధంగా ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న నేతలు
ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న నేతలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.