(Local) Fri, 29 May, 2020

తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం

November 25, 2019,   11:39 PM IST
Share on:
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 52రోజుల పాటు సమ్మె చేసి విధులకు దూరంగా ఉన్న కార్మికులను విధుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది. తెలంగాణలో పెద్దదైన దసర పండగ సందర్భంలో అనాలోచిత నిర్ణయాలతో సమ్మెకు వెళ్లారని.. ఎంత చెప్పినా వినకుండా విధుల్లోకి రాలేదని పేర్కొంది. ఇప్పుడు విధుల్లో చేరుతామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నిర్ణయం హాస్యాస్పందంగా ఉందని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ వ్యాఖ్యానించారు.లేబర్ కోర్టు నిర్ణయం వచ్చాక అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు వెళ్లి.. ఇష్టమొచ్చినప్పుడు వచ్చి విధుల్లో చేరుతామంటే ఎలా కుదురుతుందన్నారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలో సమ్మె విరమణ నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ లేఖను వెనక్కి పంపారు. రేపు డిపోల దగ్గర శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.