(Local) Mon, 27 Sep, 2021

ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలు

November 13, 2019,   3:08 PM IST
Share on:
ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ “ఎకనామిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో మంగళవారం ప్రసంగిస్తూ బాగ్దాదీ హతమైన తర్వాత ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ బాధ్యతలు స్వీకరించిన కొత్త నేతనూ అమెరికా వదలదని వెల్లడించారు. ఇప్పటికే అతని కోసం వేట ప్రారంభించామన్నారు. అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసన్నారు. ISIS కొత్త నేత అంతం గురించి రెండు రోజుల వ్యవధిలో ట్రంప్‌ రెండు సార్లు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ISIS కొత్త నేతను కూడా అంతమొందించడానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో ఉన్నట్లుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. సోమవారం 'వార్‌ వెటరన్‌ కౌన్సిల్‌ నిర్వహించిన సమావేశంలోనూ ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
ట్రంప్ కు భారీ జరిమానా
ట్రంప్ కు భారీ జరిమానా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.