(Local) Wed, 20 Oct, 2021

రెండోపర్యాయం జస్టిస్‌ట్రుడావు ఎన్నికల్లో విజయం

October 23, 2019,   12:44 PM IST
Share on:
రెండోపర్యాయం జస్టిస్‌ట్రుడావు  ఎన్నికల్లో విజయం

కెనడా  ప్రధాని జస్టిస్‌ ట్రుడావు రెండో పర్యాయం కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకూ కొనసాగిన మైనార్టీ ప్రభుత్వం నుంచి ఆయనకు ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీ లభిస్తున్నది. అధికారంలో ఉన్న లిబరల్స్‌ ప్రతినిధులు 150 జిల్లాల్లో విజేతలుగా నిలిచారు. ఆడ్రూ షీర్స్‌ కన్సర్వేటివ్‌ ప్రతినిధులు వందమంది వరకూ గెలిచినట్లు కెనడా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. పార్టీలుప్రభుత్వం ఏర్పాటుకు హౌసాఫ్‌ కామన్స్‌కు 170 సీట్ల మెజార్టీ రావాల్సి ఉంటుంది.

జస్టిన్‌ట్రుడావు రెండోసారి ప్రధాని పదవికోసం సంక్లిష్ట వ్యూహాలను అమలు చేస్తున్నారు. కుంభకోణాలు, ఓటర్లలో అసహనం ఉన్నప్పటికీ ఆయన తన ప్రత్యర్థులకంటే ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంతో ఉన్నారు. ట్రుడావు కన్సర్వేటివ్‌ నేత ఆండ్రూ షీర్‌లు తుది విడత జాబితాలకు గట్టి పోటీతో ముందుకువస్తున్నారు. ఓంటారియో, క్యూబెక్‌ వంటి ప్రాంతాల్లో ట్రుడావుకు గట్టి మద్దతు లభిస్తోంది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా 170 స్థానాలకు తగ్గకుండా రావాల్సి ఉంది. అయితే ఈసారి జాతీయ ఎన్నికల్లో లిబర్‌ పార్టీ, కన్సర్వేటివ్‌లు రెండూ కూడా పోటాపోటీగా వస్తున్నారు. ట్రుడావుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే న్యూడెమొక్రాటిక్‌ పార్టీ మద్దతు లభిస్తుంది. అయితే ఈ పార్టీ వాతావరణ మార్పుల పై ఖచ్చితమైన కార్యాచరన అమలు చేయాలని, కంపెనీలపై ఎక్కువ పన్నులు, సంపన్నులపై పన్నులు, కొత్తగా సామాజిక సార్వత్రిక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయాలని ట్రుడావు మద్దతు పార్టీ కోరుతోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.