(Local) Tue, 27 Oct, 2020

లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా

September 09, 2019,   12:50 PM IST
Share on:
లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వే ...

లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇకపై డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు విధించాలని యూపీ సర్కారు నిర్ణయించింది. కొత్త మోటారువాహనాల చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది. వాణిజ్య వాహనాలు, లారీలు నడిపే డ్రైవర్లు ఫుల్ సైజు ప్యాంటు షర్టు యూనిఫాంతోపాటు షూ తప్పనిసరిగా ధరించాలని కొత్త మోటారు వాహనాల చట్టం నిర్దేశించింది. డ్రెస్ కోడ్ ను డ్రైవర్లు ఉల్లంఘిస్తే 1989 మోటారువాహనాల చట్టం ప్రకారం 500 రూపాయల జరిమానా ఉండేది. ప్రస్తుత కొత్త చట్టం 2019 ఎంవీ యాక్ట్ ప్రకారం డ్రైవర్లు లుంగీ ధరించి డ్రైవింగ్ చేస్తే రెండువేల రూపాయల జరిమానా విధిస్తున్నామని యూపీ అదనపు రవాణ శాఖ కమిషనర్ యూపీ గంగాఫల్ చెప్పారు.

సంబంధిత వర్గం
సౌత్ అమెరికా లో నిత్యానంద ...
సౌత్ అమెరికా లో నిత్యానంద ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.