(Local) Wed, 18 Sep, 2019

దక్షిణ కశ్మీర్‌లో అల్లరిమూకలు రాళ్లతో దాడి -దాడిలో డ్రైవర్‌ మృతి

August 26, 2019,   2:30 PM IST
Views: 78
Share on:
దక్షిణ కశ్మీర్‌లో అల్లరిమూకలు రాళ్లతో దాడి -దాడిలో ...

జమ్ము కశ్మీర్‌ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆదివారం రాత్రి అల్లరి మూకలు రెచ్చిపోయారు. జ్రాదీపోరాలో ఓ ట్రక్కు డ్రైవర్‌పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ నూర్‌ మహ్మద్‌ దార్‌(42) చికిత్స పొందుతూ కన్నుమూశారు.రాళ్ల దాడికి పాల్పడ్డ అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడి కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుకాల ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు. ఆ ట్రక్కు సెక్యూరిటీకి చెందిన వాహనం అనుకొని దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత వర్గం
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.