(Local) Mon, 23 Sep, 2019

అరుణ్ జెట్లి మృతి - ప్రముఖుల సంతాపం

August 24, 2019,   1:48 PM IST
Views: 136
Share on:
అరుణ్ జెట్లి  మృతి - ప్రముఖుల సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల టిడిపి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన సేవలు చిరస్మరణీయం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన మృతి బిజెపి కే కాకుండా మొత్తం దేశానికే తీరనిలోటు. అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాను అని చంద్రబాబు తెలిపారు.

సిఎం కెసిఆర్‌ కేంద్ర మాజీ  మంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కెసిఆర్‌ స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు జైట్లీ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఏపి సిఎం జగన్‌ బిజెపి సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో జగన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి....
కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.